ఎన్టీఆర్ కోసం అనిరుద్ అవుట్ .. థమన్ ఇన్ ?

Wednesday, February 14th, 2018, 09:26:30 AM IST

సినిమా పరిశ్రమలో ఎవరి కెరీర్ అయినా, ఏ అవకాశం అయినా .. సినిమా సక్సెస్ పైనే ఆధారపడి ఉంటుంది. ఎంత క్రేజీ కాంబినేషన్ అయినా సరే ఒక్కసారి ఫలితం బెడిసి కొట్టిందా .. ఆ కాంబినేషన్ హుళక్కే !! ఇప్పుడు పరిస్థితి అలాగే తయారైంది సంగీత దర్శకుడు అనిరుద్ విషయంలో … ఇప్పుడు ఎందుకు ఈ కథంతా అంటే .. లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్లో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమాకు సంగీతం అందించాడు తమిళ సంగీత దర్శకుడు అనిరుద్. ఆ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఆ సినిమాతో పాటు త్రివిక్రమ్ నెక్స్ట్ ఎన్టీఆర్ తో చేసే సినిమాకు కూడా అనిరుద్ తోనే సంగీతం చేయించాలని ఫిక్స్ అయ్యాడు త్రివిక్రమ్ కానీ.. అజ్ఞాతవాసి భారీ పరాజయం పాలవడంతో ఇప్పుడు త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా నుండి అనిరుద్ అవుట్ అయ్యాడు .. ఆ ప్లేస్ లోకి థమన్ ఎంట్రీ ఇచ్చాడు. అజ్ఞాతవాసి విషయంలో అనిరుద్ పెద్దగా ఆకట్టుకునే మ్యూజిక్ ఇవ్వలేదని విమర్శలు వచ్చాయి. దాంతో ఎన్టీఆర్ – త్రివిక్రమ్ చర్చించుకుని అనిరుద్ కాకుండా థమన్ అయితే బెటర్ అని నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.

  •  
  •  
  •  
  •  

Comments