పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని మెప్పిస్తా

Friday, November 25th, 2016, 09:52:55 AM IST

anirudh (1)
రెండు సార్లు తెలుగులో అనిరుధ్ మ్యూజిక్ ఇవ్వాల్సి ఉన్నా అనుకోని కారణాల వలన ఆ ఛాన్స్ మిస్ అయ్యింది. అనిరుధ్ మ్యూజిక్ అంటే తమిళనాడు లో పిచ్చ క్రేజ్ అతనికి ప్రత్యేకంగా ఫాన్స్ ఉన్నారు. ఒక హీరోకి ఉండే ఫాన్ ఫాలోయింగ్ అనిరుధ్ కి అక్కడ ఉంది అంటే వింతేమీ కాదు. రామ్ చరణ్ బ్రూస్ లీ , నితిన్ అ ఆ సినిమాలకి అనిరుద్ మ్యూజిక్ ఇవ్వాల్సి ఉన్నా ఛాన్స్ మిస్ అయ్యింది. ఈ సారి పవన్ కళ్యాణ్ సినిమాకి సైన్ చేసిన అనిరుధ్ తన పెర్ఫార్మెన్స్ తో పవన్ ఫాన్స్ ని మెప్పిస్తా అంటున్నాడు. ఈ విషయం అతనే స్వయంగా చెప్పడం విశేషం.”పవన్ మూవీకి ఇంకా కంపోజింగ్ ప్రారంభించలేదు. అయితే.. నాకు స్టోరీతో పాటు సినిమా గురించి పూర్తి ఐడియా ఉంది. త్వరలో వర్క్ ప్రారంభించనున్నాం. త్రివిక్రమ్ గారితో మాట్లాడి.. ప్రమోషనల్ సాంగ్స్ కూడా ప్లాన్ చేయాలని అనుకుంటున్నాను. ఇవన్నీ పవన్ కళ్యాణ్ అభిమానుల అంచనాలను అందుకునేలా ఉండేలా జాగ్రత్త పడతాను” అని చెప్పాడు అనిరుధ్.