తేజ డిస్క‌వ‌రీ నాగిని విన్యాసాలు?

Thursday, April 12th, 2018, 02:57:25 PM IST

తేజ ద‌ర్శ‌క‌త్వంలో నువ్వు నేను చిత్రంలో న‌టించింది అనిత‌. హిందీ సీరియ‌ళ్ల‌లో చూసి తేజ ఈ సినిమాకి ఆడిష‌న్స్‌లో ఎంపిక చేసుకున్నాడు. కీ.శే.ఉద‌య్‌కిర‌ణ్ న‌టించిన ఈ చిత్రం బ్లాక్‌బ‌స్ట‌ర్‌. తొలి ప్ర‌య‌త్న‌మే క్రేజీ ఉద‌య్‌తో అవ‌కాశం అందుకున్న‌ అనిత పెద్ద స‌క్సెస్‌. అటుపై `శ్రీ‌రామ్‌` చిత్రంలో సేమ్ జంట రిపీటైంది. అయితే కాల‌క్ర‌మంలో తెలుగులో అవ‌కాశాలు త‌గ్గ‌డంలో మ‌ళ్లీ త‌న మూలాల్ని వెతుక్కుంటూ టీవీ సీరియ‌ళ్ల‌కే అంకిత‌మైంది. ప్ర‌స్తుతం బుల్లితెర‌పై ఫుల్ బిజీ స్టార్ అనిత‌. ఈ భామ వ‌రుస‌గా సీరియ‌ళ్ల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపేస్తోంది.

తాజాగా క‌ల‌ర్స్ చానెల్‌లో ప్ర‌సారం అవుతున్న `నాగిని` టీవీ సిరీస్‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానుల్ని అల‌రించ‌నుంది. నాగిని 1, నాగిని 2లో వేరే క‌థానాయిక‌లు నాగిని పాత్ర‌లో పోషించారు. ఈసారి మాత్రం ఆ అవ‌కావం,. అదృష్టం ఉద‌య్ నాయిక‌కు ద‌క్కింది. నాగిని పాత్ర‌లో అనిత విన్యాసాలు వీక్షించేందుకు అటు హిందీ, ఇటు తెలుగు ప్రేక్ష‌కులు సంసిద్ధ‌మ‌వుతున్నారు. నేటి నుంచి క‌ల‌ర్స్‌లో నాగిని 3 టెలీకాస్ట్ అవుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments