అంజలి బంపర్ అఫర్ ఇచ్చిందిగా ?

Wednesday, January 17th, 2018, 04:19:20 PM IST

తెలుగు భామ అంజలికి ఈ మధ్య కెరీర్ బాగా వీక్ అయింది. చేసిన సినిమాలన్నీ వరుసపెట్టి పరాజయాలు అందుకోవడంతో పాపం ఈ అమ్మడికి కొత్త అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న బెలూన్ సినిమా కూడా విడుదలకు టెన్షన్ పడుతుంది. ఈ నేపథ్యంలో అంజలి అవకాశాలు కోసం ఓ మెట్టు దిగింది. ఇప్పటికే తనతో సినిమాలు చేసే నిర్మాతలకు బంపర్ ఆఫర్ల ఇస్తూ .. రెమ్యూనరేషన్ విషయంలో ఎలాంటి కండిషన్స్ లేవని .. పైగా ఒక సినిమా చేస్తే మరో సినిమాకూడా చేస్తానంటూ బంపర్ అఫర్ ఇస్తుంది. తాజాగా ఓ నిర్మాతకు అలాంటి ఆవకాశం ఇచ్చిందట. ఎన్నో ఆశలు పెట్టుకున్న చిత్రాంగద భారీ పరాజయాన్ని అందుకోవడంతో కొత్త అవకాశాలు తగ్గాయి. తాజాగా ఆమె ఓ లేడి ఓరియెంటెడ్ సినిమాకోసం సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాతకు మరో సినిమా ఫ్రీగా చేస్తానని చెప్పిందట. సో ఈ లెక్కన్న ఈ అమ్మడికి మరిన్ని అవకాశాలు క్యూ కట్టే ఛాన్స్ లేకపోలేదు.