ఫ్యాషన్ షో లో ట్రాన్స్ జెండర్.. అందగత్తెలకు సవాల్..!

Saturday, December 31st, 2016, 01:16:29 AM IST

fashion
ఫ్యాషన్ షో లో ఆడవాళ్లు లేదా మగవాళ్ళు పాల్గొనడం చూసి ఉంటాం. కానీ నేపాల్ కు చెందిన ఓ ట్రాన్స్ జెండర్ లక్మే ఫ్యాషన్ వీక్ లో పాల్గొంటూ అందగత్తెలైన మోడల్స్ కు సవాల్ విసురుతోంది.నేపాల్ కు చెందిన అంజలి లామా అనే ట్రాన్స్ జెండర్ లాకమే ఫ్యాషన్ వీక్ 2017 కు సెలెక్ట్ అయింది. నేపాల్ లోని ఓ రైతు కుటుంబం లో పుట్టి పెరిగిన లామా జీవితం లో ఏదో ఒకటి సాధించాలని కలలు కంది.

మోడల్ గా ఎదగాలని నిర్ణయించుకుంది. తన ఆర్ధిక స్థితి సహకరించకపోయినా పట్టుదలతో ఈస్థాయికి చేరుకుంది లామా. ఫ్యాషన్ వీక్ లో పాల్గొనబోయె మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ గా లామా రికార్డుకెక్కింది. అంతేకాదు లాకమే ఫ్యాషన్ వీక్ లో పాల్గొనబోయె మిగతా సుందరాంగులకు సవాల్ విసురుతోంది.ఫ్యాషన్ వీక్ లో పాల్గొనేందుకు అవకాశం దక్కించుకున్న లామా కు పలువురు అభినందనలు తెలుపుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments