మీడియాకు కండిషన్స్ పెడుతున్న తెలుగు భామ ?

Monday, February 20th, 2017, 08:38:48 PM IST


తెలుగు భామ అంజలికి ఈ మధ్య తెలుగులో పెద్దగా సినిమాలు లేవు. ఆ మధ్య సరైనోడు సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. ఆ సినిమా తరువాత అవకాశాలు వస్తాయని అనుకుంది కానీ అది వర్కవుట్ కాలేదు. ఇక చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న చిత్రాంగద మొత్తానికి విడుదలకు సిద్ధం అయింది. ఈ మధ్య తమిళ్ హీరో జై తో అంజలి రాసుకుపూసుకు తిరుగుతుందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వచ్చాయి. వీరి విషయం వైరల్ అయింది, ఇక చిత్రాంగద సినిమా పూర్తయింది కాబట్టి త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా అంజలి తో మీడియా ఇంటరాక్ట్ చేయించాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే తాను మీడియా విషయంలో కండిషన్స్ ఉన్నాయని, వాటన్నికి ఓకే అంటేనే మీడియా ముందుకు వస్తానని చెప్పింది? ఇంతకి అంజలి కండిషన్స్ ఏమిటో తెలుసా .. సినిమా గురించి ఏమి అడిగినా చెబుతానని, అంతే కానీ తన పర్సనల్ విషయాల గురించి, గతంలో జరిగిన సంఘటనల గురించి మాత్రం అడగొద్దని కండిషన్స్ పెట్టిందట !! వాటన్నిటికీ ఓకే అంటేనే .. ప్రమోషన్స్ కి వస్తానని అంటుందట ? మరి ఈ విషయంలో మీడియా వారి రెస్పాన్స్ ఏమిటో చూడాలి !!