షాక్ .. చక్కనమ్మ బాగా చిక్కిందిగా ?

Sunday, September 16th, 2018, 12:16:12 PM IST

సినిమా హీరోయిన్ అంటేనే .. మంచి స్లిమ్ అండ్ ట్రిమ్ గా గ్లామరస్ గా ఉండాలి. అలాంటి వారికే మంచి క్రేజ్, పైగా అవకాశాలు కూడా వారికే వస్తాయి. అయితే కెరీర్ మొదటి నుండి తెలుగు భామ అంజలి మాత్రం కాస్త ముద్దుగా బొద్దుగా ఉండేది. అందుకే ఈ అమ్మడికి కుర్ర హీరోల సినిమాల్లో పెద్దగా ఛాన్సులు దక్కలేదు. అయినా సరే వెంకటేష్, బాలకృష్ణ లాంటి స్టార్స్ తో నటించింది. అయితే అంజలి టార్గెట్ మాత్రం .. యంగ్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేయాలని ఆలోచనలో ఉంది. ఈ మధ్య అంజలికి వరుస పరాజయాలు పలకరించాయి. చేస్తున్న సినిమాలన్నీ ప్లాప్ అవ్వడంతో సినిమాలు బాగా తగ్గాయి. దాంతో ఈ అమ్మడు స్లిమ్ అవ్వడానికి బాగానే కష్టపడింది. ప్రస్తుతం చాల స్లిమ్ గా మారిన అంజలిని చూసి అందరు షాక్ అవుతున్నారు .. తాజాగా ఓ ఈవెంట్ లో ఈ అమ్మడు వేసిన డాన్స్ కూడా ఓ ఊపు ఊపేసింది. తాజాగా అంజలి సైమా అవార్డు వేడుక కోసం దుబాయ్ వెళ్ళింది .. అక్కడ అంజలి న్యూ లుక్ గ్లామర్ చూసి అందరు షాక్ అయ్యారట. మరి ఈ న్యూ స్లిమ్ లోక్ లో అంజలికి అవకాశాలు క్యూ కడతాయేమో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments