నవంబర్ లో ఎన్టీఆర్ క్యాంటిన్లు ప్రారంభం

Sunday, September 28th, 2014, 10:57:14 AM IST

anna
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేనెల నుంచి అన్న క్యాంటిన్లు ప్రారంభం అవుతున్నాయి. తొలివిడతగా తిరుపతిలో 5, విశాఖపట్నంలో 10, అనతపురంలో 5 మరియు గుంటూరులో 10 క్యాంటినులకు ఏర్పాటు చేయనున్నట్టు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఇప్పటికే ఆర్ధికంగా చాల ఇబ్బందులు పడుతున్నారని.. వారి ఇబ్బందులను అర్ధం చేసుకున్నామని.. అందుకే.. ప్రజలపై పన్నుల భారం మోపకుండా.. ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం మున్సిపల్ శాఖలో సిబ్బంది కొరత ఉన్నదని..త్వరలోనే ఖాళీలను పుర్తిస్తామని ఆయన తెలిపారు.