జగన్ పార్టీనీ రద్దు చేయాలి.. అన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత డిమాండ్..!

Sunday, June 28th, 2020, 02:57:27 AM IST


ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ పార్టీనీ రద్దు చేయాలని అన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎస్సార్‌ రాజారామిరెడ్డి డిమాండ్ చేశారు. అయితే తమ పార్టీ పేరు చెప్పుకొని గత ఎన్నికల్లో గెలిచిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ (జగన్‌ పార్టీ) గుర్తింపును రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరనున్నట్లు తెలిపాడు.

తమ పార్టీ జాతీయ పార్టీగా రిజిస్టర్‌ అయ్యిందని, సీఎం జగన్ ఆయన పార్టీ పేరును తొక్కిపెట్టి తమ పార్టీ పేరును పదే పదే ఎన్నికల్లో ప్రస్తావించి అధికారం చేపట్టారన్నారు. ఎన్నికల సంఘంలో నమోదైన పేరుకు, ఆ పార్టీ నాయకులు చెప్పుకునే పార్టీకి పొంతన లేదని, ఇక ఆ పార్టీకి అధికారంలో కొనసాగే అర్హత లేదని అన్నారు. గత ఎన్నికలలో తాను మైదుకూరు అభ్యర్థిగా తమ పార్టీ తరఫున పోటీ చేశానని అందుకే కక్ష కట్టి తన పొలంలోకి నీరు పారకుండా చేశారని ఆరోపించారు.