” మీకు దణ్ణం పెడతాం , జగన్ ని అమరావతి కి రానివ్వకండి “

Saturday, January 21st, 2017, 01:06:21 PM IST

anam-vivekananda
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి మీద కొత్తగా టీడీపీ లో జాయిన్ అయిన ఆనం వివేకా ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఏపీ అభివృద్ధి కి అడ్డం పడే జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు పోలవరం , పట్టిసీమ కి అడ్డం పడుతున్నారు అని ఆయన ఆక్షేపించారు. అభివృద్ధికి అడ్డుపడుతున్న వైఎస్సార్సీపీ మట్టిలో కలిసిపోతుందని, ముఖ్యమంత్రిని అవుతానంటూ జగన్ కాకిలా అరుస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. ‘బాబు గారు, మీకు దండం పెడతా..అమరావతిలోకి జగన్ ను రానివ్వొద్దు. రాష్ట్ర యువత భవిష్యత్ అమరావతిలో ఉంది. రాబోయే రోజుల్లో 26 జిల్లాలు అవుతాయి. రెండేళ్ల తర్వాత రాష్ట్రపతి విడిది అమరావతిలోనే’ అని ఆనం వివేకా పేర్కొన్నారు.