బిగ్ న్యూస్: భారత్ లో కరోనా విలయ తాండవం…మరో 1,027 మంది మృతి!

Wednesday, April 14th, 2021, 10:48:04 AM IST

india_corona

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 14,11,758 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 1,84,372 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే రెండు లక్షలకు చేరువలో పాజిటివ్ కేసులు నమోదు కావడం తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. అయితే తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య కోటి 38 లక్షలకు పైగా చేరింది. మరొక పక్క వాక్సిన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం గా జరుగుతోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య గణీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో వెయ్యికి పైగా కరోనా వైరస్ మరణాలు నమోదు కావడం భయాందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,027 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,72,085 కి చేరింది. నిన్న ఒక్క రోజే 82,339 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య దేశం లో 1,23,36,036 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 13,65,704 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.