తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు..!

Saturday, April 3rd, 2021, 11:06:15 AM IST


తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తుంది. ఓ పక్క కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జరుగుతున్నప్పటికి కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 59,705 కరోనా పరీక్షలు నిర్వహించగా 1078 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,10,819 కి చేరింది.

అయితే కరోనా నుంచి ఇప్పటివరకు 3,02,207 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 6,900 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 331 మంది కరోనా నుంచి కోలుకోగా మరో ఆరుగురు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,712 కి చేరింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 1,03,29,954 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 97.22 శాతం ఉండగా, మరణాల రేటు 0.55% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.