దేశంలో విజృంభిస్తున్న కరోనా…రెండు లక్షలకు పైగా కేసులు…వెయ్యికి పైగా మరణాలు

Friday, April 16th, 2021, 11:32:12 AM IST

india_corona

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. రెండవ రోజు కూడా రెండు లక్షలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరొకసారి వెయ్యికి పైగా కరోనా వైరస్ మరణాలు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 14,73,210 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 2,17,353 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,42,91,917 కి చేరింది. అయితే ఈ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉండటం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 1,185 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,74,308 కి చేరింది. నిన్న ఒక్క రోజే 1,18,302 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ భారత్ లో కోటి ఇరవై అయిదు లక్షల మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 15 లక్షల కి పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.