బిగ్ న్యూస్: తెలంగాణ లో మరో 1269 కేసులు…8 మరణాలు!

Sunday, July 12th, 2020, 09:32:18 PM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి పెరుగుతూనే ఉంది. ఏ మాత్రం కేసులు తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో 1,269 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 34,671 కి చేరింది. అయితే తెలంగాణ రాష్ట్రం లో నేడు కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు 8,153 చేయగా, ఇప్పటి వరకూ 1,70,324 పరీక్షలు చేశారు.

అయితే కరోనా వైరస్ సోకి కోలుకుంటున్న వారి సంఖ్య సైతం రోజురోజుకీ పెరుగుతోంది. ఈరోజు పాజిటివ్ కేసుల కంటే డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య ఎక్కువ. గడిచిన 24 గంటల్లో 1,563 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ భారిన పడి కోలుకున్న వారి సంఖ్య 22,482 కి చేరింది. కరోనా కారణంగా నేడు 8 మంది ప్రాణాలను కోల్పోయారు. కరోనా సోకి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 356 కి చేరింది.

అయితే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నమోదు అవుతున్నాయి. నేడు 800 కేసులు నమోదు కాగా, రంగారెడ్డి లో 132, మేడ్చల్ లో 94 కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ ఉద్రితి ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు.