భారత్ లో మరో 16,738 కేసులు…138 మరణాలు

Thursday, February 25th, 2021, 10:52:58 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ఏడు లక్షల తొంభై మూడు వేలకి పైగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 16,738 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,10,46,914 కి చేరింది. అయితే ఈ మహమ్మారి కి వాక్సిన్ అందుబాటులోకి వచ్చిన అనంతరం నుండి మృతుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది.

భారత్ లో మరొకసారి మృతుల సంఖ్య తారాస్థాయి కి చేరింది. గడిచిన 24 గంటల్లో మరో 138 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,56,705 కి చేరింది. నిన్న ఒక్క రోజే 11,799 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 1,07,38,501 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 1,51,708 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం గా కొనసాగుతుండటం తో పాజిటివ్ కేసుల సంఖ్య తో పాటుగా మృతుల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.