తెలంగాణ లో తగ్గిన కరోనా కేసులు…మరణాలు!

Monday, June 7th, 2021, 07:27:06 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే గత కొద్ది రోజులుగా లాక్ మరియు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల తో రాష్ట్రంలో పాజిటివ్ కేసులు తక్కువగా నమోదు అవుతున్నాయి. అంతేకాక మరణాలు సైతం చాలా తక్కువగా సంభవిస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో మరో 97,751 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 1,436 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 5,91,170 కి చేరింది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 14 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 3,378 కి చేరింది. నిన్న ఒక్క రోజే 3,614 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 5,60,776 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 27,016 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.