కరోనా అప్డేట్: తెలంగాణ లో మరో 1,446 కేసులు…8 మరణాలు!

Wednesday, October 14th, 2020, 09:28:11 AM IST


తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 40,056 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 1,446 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,16,238 కి చేరింది. అయితే ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 8 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తాజాగా కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి తో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,241 కి చేరింది.

అయితే కరోనా వైరస్ రికవరీ రేటు తెలంగాణ రాష్ట్రం లో మెరుగ్గానే ఉంది అని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో మరో 1,918 మంది కరోనా వైరస్ భారీ నుండి కొలుకోగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 1,91,269 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 23,728 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. ఇంకా కరోనా వైరస్ కి వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో ఈ కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.