తెలంగాణలో మరో 1,486 కరోనా కేసులు

Tuesday, October 20th, 2020, 10:06:09 AM IST

తెలంగాణ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తూ ఇంకా వెయ్యి కి పైగా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 42,299 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 1,486 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,24,545 కి చేరింది. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ఏడుగురు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 1,282 కి చేరింది. నిన్న ఒక్క రోజే 1,891 మంది కరోనా వైరస్ భారీ నుండి కొలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రం లో 2,02,577 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 20,686 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.