తెలంగాణ లో మళ్లీ భారీగా నమోదు అయినా కరోనా కేసులు!

Wednesday, July 22nd, 2020, 10:18:05 PM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఏ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకీ తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరో 1,554 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదు అయిన పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి సోకిన వారి సంఖ్య 49,259 కి చేరింది. కరోనా వైరస్ కేసుల సంఖ్య దాదాపు 50 వేలకు చేరడం రాష్ట్ర ప్రజలను కలవరానికి గురి చేస్తోంది.

అయితే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉన్నా, రికవరీ కేసుల సంఖ్య సైతం కూడా పెరుగుతూ వస్తోంది. ఒక్క రోజులో నే 1,281 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 37,666 కి చేరింది. కరోనా వైరస్ తో ఒక్క రోజులోనే 9 మంది ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 438 కి చేరింది. అయితే రాష్ట్రం లో ప్రస్తుతం 11,155 కరోనా కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. రికవరీ రేటు తెలంగాణ రాష్ట్రం లో ఎక్కువే అని చెప్పాలి. కరోనా వైరస్ భారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే ఈ విషయం కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పాలి.