తెలంగాణ లో మరో 1,567 కరోనా కేసులు..!

Thursday, July 23rd, 2020, 10:22:45 PM IST


కరోనా వైరస్ మహమ్మారి రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం లో మరింత ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. తెలంగాణ రాష్ట్రం లో కొత్తగా 1,566 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 50,826 కి చేరింది. అయితే గడిచిన 24 గంటల్లో 9 మంది మృతి చెందగా, ఇప్పటి వరకు తెలంగాణ లో కరోనా వైరస్ భారిన పడి 447 మంది ప్రాణాలను కోల్పోయారు.

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న ప్పటీకి కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,661 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకూ కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 39,327 కి చేరింది. అయితే వీటి సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 11,052 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.