భారత్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు…మరో 167 మరణాలు

Tuesday, January 12th, 2021, 12:48:35 PM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ కేసులు దేశం లో తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో మరో 8,97,056 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 12,584 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,04,79,179 కి చేరింది. అయితే కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత రోజురోజుకీ తగ్గుముఖం పట్టడం తో పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా వైరస్ మృతుల సంఖ్య రోజురోజుకి కాస్త తగ్గుముఖం పడుతుంది. గడిచిన 24 గంటల్లో మరో 167 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,51,327 కి చేరింది. నిన్న ఒక్కరోజే 18,385 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 1.01 కోట్లకు చేరింది. దేశంలో కరోనా వైరస్ రికవరీ రేటు 96.49 గా ఉంది. ప్రస్తుతం భారత్ లో 2,16,558 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.