బిగ్ న్యూస్: భారత్ లో మరో 2,59,170 కేసులు…1,761 మరణాలు

Tuesday, April 20th, 2021, 10:08:25 AM IST

india_corona

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత భారత్ లో కొనసాగుతూనే ఉంది. ఏడాది దాటినప్పటికి దీని తీవ్రత ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. పాజిటివ్ కేసుల సంఖ్య వరుసగా రెండు లక్షల కి పైగా నమోదు కావడం మరింత ఆందోళన కలిగించే అంశం అని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో మరో 15,19,486 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించిగా అందులో 2,59,170 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,53,21,089 కి చేరింది. అయితే మరో పక్క ఈ మహమ్మారి కి వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం గా జరుగుతోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 1,761 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,80,530 కి చేరింది. నిన్న ఒక్క రోజే 1,54,761 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 1,31,08,582 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 20,31,977 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. అయితే మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ లో ఈ మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉంది. పాజిటివ్ కేసులు మరియు మరణాలు అక్కడ ఎక్కువగా నమోదు అవుతున్నాయి.