కరోనా అప్డేట్: తెలంగాణలో కొత్తగా మరో 1,813 పాజిటివ్ కేసులు..!

Wednesday, June 9th, 2021, 11:20:16 PM IST

తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గు ముఖం పడుతున్నాయి. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో కేసుల సంఖ్య కాస్త తక్కువ అనే చెప్పాలి. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 1,29,896 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,813 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,96,813కి చేరింది.

అయితే కరోనా నుంచి ఇప్పటివరకు 5,69,086 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 24,301 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1,801 మంది కరోనా నుంచి కోలుకోగా మరో 17 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,426కి చేరింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 1,62,57,268 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 95.35 శాతం ఉండగా, మరణాల రేటు 0.57% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.