కరోనా అప్డేట్: భారత్ లో మరో 19,459 కేసులు…380 మరణాలు!

Monday, June 29th, 2020, 10:10:39 AM IST

భారత్ లో కరోనా వైరస్ ను అరికట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,70,560 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయగా 19,459 మందికి పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయినా ఈ కేసులతో మొత్తం భారత్ లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 5,48,318 కి చేరింది. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారత్ లో 380 మంది గత 24 గంటల్లో మరణించారు. ఈ మరణాల తో మొత్తం భారత్ లో కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 16,475 కి చేరింది.

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ కరోనా వైరస్ భారీ నుండి కోలుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 3,21,722 కి చేరింది. అయితే యాక్టి వ్ కేసులు ఇంకా 2,10,120 ఉన్నాయి. అయితే యాక్టిివ్ కేసుల కంటే రికవరీ కేసులు ఎక్కువగా ఉండటం గమనార్హం. కరోనా వైరస్ సోకుతున్న దేశాల్లో ప్రపంచంలోనే భారత్ నాల్గవ స్థానం లో కొనసాగుతుంది. ఇప్పటి వరకు భారత్ లో 83,98,362 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకూ కరోనా వైరస్ కి వాక్సిన్ ఇంకా అందుబాటులోకి లేకపోవడం తో ఈ కేసులు మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.