తెలంగాణలో రెండు వేలు దాటిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Thursday, April 8th, 2021, 10:23:59 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతోంది. అంతకుముందు రెండు వేలకు చేరువలో పాజిటివ్ కేసులు నమోదు కాగా, నిన్న రెండు వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరో 87,332 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 2,055 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 3,18,704 కి చేరింది. అయితే ఈ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ఏడుగురు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి మధ్య 1,741 కి చేరింది. నిన్న ఒక్క రోజే 303 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య తెలంగాణ రాష్ట్రం లో 3,03,601 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 13,362 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.