భారత్ లో మూడు లక్షలు దాటిన కరోనా కేసులు…మరో 2,104 మంది మృతి

Thursday, April 22nd, 2021, 01:27:51 PM IST

india_corona
భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటి వరకూ ఈ దేశం లో కూడా ఒక్క రోజులో 3.14 లక్షలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాలేదు.అయితే గడిచిన 24 గంటల్లో భారత్ లో 16,51,711 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 3,14,835 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే ప్రపంచం లో కెల్లా ఇవే అత్యధిక కేసులు అని చెప్పాలి. అంతకుముందు అమెరికా లో 3.07 లక్షల కేసులు 24 గంటల్లో నమోదు అయ్యాయి. అయితే భారత్ లో తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,59,30,965 కి చేరింది. అయితే ఈ స్థాయిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడం పట్ల ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు.

అదే తరహా లో కరోనా వైరస్ మృతుల సంఖ్య సైతం భారీగా పెరుగుతోంది. ఊహించని రీతిలో గడిచిన 24 గంటల్లో 2,104 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే భారత్ లో ఇన్ని మరణాలు ఒక్క రోజే సంభవించడం ఇదే తొలిసారి. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,84,657 కి చేరింది. అయితే ఈ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం ఆందోళన కలిగించే అంశం అని చెప్పాలి. నిన్న ఒక్క రోజే 1,78,841 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య దేశం లో కోటి 34 లక్షల కి పైగా చేరింది. ప్రస్తుతం 22 లక్షలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.