కరోనా అప్డేట్: తెలంగాణ లో మరో 2,216 కేసులు…11 మంది మృతి!

Sunday, September 13th, 2020, 10:40:04 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ వ్యాప్తి ఏ మాత్రం తగ్గడం లేదు. వేల సంఖ్యలో నమోదు అవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో రాష్ట్ర ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 2,216 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,57,096 కి చేరింది. అయితే ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

గడిచిన 24 గంటల్లో 11 మంది ఈ మహమ్మారి భారిన పడి ప్రాణాలను కోల్పోగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ చికిత్స పొందుతూ మృతి చెందిన వారి సంఖ్య 961 కి చేరింది. కరోనా వైరస్ రికవరీ రేటు తెలంగాణ లో మెరుగ్గా ఉంది అని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 2,603 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 1,24,528 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 31,607 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. అయితే ఇందులో 24,674 మంది హోమ్ ఐశోలేశన్ లో చికిత్స పొందుతున్నారు.