భారత్ లో మరో 92,596 కేసులు…2,219 మరణాలు

Wednesday, June 9th, 2021, 10:41:00 AM IST


భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 19,85,967 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 92,596 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే వరుసగా రెండవ రోజు లక్ష లోపు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడం కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పాలి. అయితే తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య రెండు కోట్ల 90 లక్షలకు పైగా చేరింది. అయితే ఈ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం కాస్త ఆందోళన కలిగిస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 2,219 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 3,53,528 కి చేరింది. నిన్న ఒక్క రోజే 1,62,664 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. భారత్ లో పాజిటివ్ కేసుల కంటే రికవరీ ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే ఇప్పటి వరకూ భారత్ లో 2 కోట్ల 75 లక్షలకు పైగా కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 12,31,415 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.