తెలంగాణ లో మరో 2,574 కరోనా కేసులు…9 మంది మృతి!

Sunday, September 6th, 2020, 10:25:07 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 62,736 మంది కి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 2,574 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే తాజాగా నమోదు అయిన ఈ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,40,969 కి చేరింది. అయితే ఈ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోవడం పట్ల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ మరణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 9 మంది ఈ మహమ్మారి భారిన పడి ప్రాణాలను కోల్పోయారు. తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 886 కి చేరింది. అయితే కరోనా వైరస్ రికవరీ రేటు తెలంగాణ రాష్ట్రం లో మెరుగ్గా ఉంది అని చెప్పాలి. 2,927 మంది ఒక్క రోజే కరోనా వైరస్ నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,07,530 కి చేరింది. తెలంగాణ రాష్ట్రం లో ప్రస్తుతం 32,553 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. అయితే ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.