బిగ్ అప్డేట్: భారత్ లో రికార్డ్ స్థాయిలో కరోనా మరణాలు…ఒక్క రోజే 260 మంది మృతి!

Thursday, June 4th, 2020, 11:48:00 AM IST

భారత్ లో లాక్ డౌన్ 5.0 మొదలయినప్పటి నుండి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. కరోనా వైరస్ భారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 260 మంది మరణించారు. భారత్ లో ఒక్క రోజే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇలా మరణించడం ఇదే తొలిసారి. అయితే ప్రజలు ఈ విషయం పై ఆందోళన చెందుతున్నారు.

భారత్ లో 24 గంటల్లో 9,304 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన కి గురి చేస్తుంది. ఇప్పటి వరకూ కొవిద్ 19 భారిన పడిన వారి సంఖ్య దేశంలో 2,16,919 కి చేరింది.అంతేకాక కరోనా వైరస్ మరణాలు కూడా రోజుకి రెండు వందల కి పైగా నమోదు అవుతున్నాయి. అయితే గురువారం నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో, మొత్తం కరోనా వైరస్ ద్వారా మరణించిన వారి సంఖ్య 6,075 కి చేరింది.

అయితే కరోనా వైరస్ మహమ్మారి ద్వారా మరణించిన దేశాలలో భారత్ 13 వ స్థానం లో ఉండగా, తాజాగా నమోదు అయిన మరణాల తో 12 వ స్థానానికి ఎగబాకింది.1,04,107 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా, మిగతా 1,06,737 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మరణాలు పెరుగుతూ ఉన్నాయి. దాదాపు వారం రోజుల నుండి కరోనా వైరస్ మరణాలు సైతం పెరుగుతూనే ఉన్నాయి.ప్రస్తుతం కరోనా వైరస్ సోకిన దేశాల లిస్ట్ లో భారత్ 7 వ స్థానం లో ఉంది.