వాంఖడే లో మరో ముగ్గురికి సోకిన కరోనా

Tuesday, April 6th, 2021, 02:21:09 PM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే ఐపియల్ సమీపిస్తున్న కొద్దీ ఈ ఆందోళన మరింత ఎక్కువగా ఉంది. అయితే ముంబై లో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నప్పటికి వాంఖడే లో ఐపియల్ మ్యాచ్ లు జరుగుతాయి అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తాజాగా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో ముగ్గురికి కరోనా వైరస్ సోకింది. అక్కడ పని చేస్తున్న ప్లంబర్ తో పాటుగా మరో ఇద్దరికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇప్పటికే 11 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే. గతవారం పాజిటివ్ వచ్చిన వారికి ప్రస్తుతం నెగటివ్ ఉండగా, తాజాగా మరో ముగ్గురికి కరోనా వైరస్ సోకింది.

అయితే ఐపియల్ లో భాగం గా వాంఖడే లో 10 మ్యాచ్ ల వరకూ జరగనున్నాయి. అయితే తాజాగా నమోదు అవుతున్న పాజిటివ్ కేసుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు అంటున్నారు.