ఏపీ లో కరోనా మరణ మృదంగం… ఒక్క రోజులోనే 37 మంది మృతి!

Monday, July 13th, 2020, 07:45:55 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే నమోదు అవుతున్న పాజిటివ్ కేసులు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తుండగా, మరణాలు సైతం ఇపుడు కలవరపెడుతున్నాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుండి సోమవారం ఉదయం 9 గంటలకు కరోనా వైరస్ భారిన పడి 37 మంది ప్రాణాలను కోల్పోయారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటి వరకూ ఇంతమంది 24 గంటల్లో మరణించడం ఇదే తొలిసారి. తాజాగా 1,935 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో 1,919 ఏపీ కి చెందినవి కాగా, మిగతా కేసులు ఇతర రాష్ట్రాల,దేశాల నుండి వచ్చిన వారివి.

ఈ వైరస్ కి వాక్సిన్ ఇంకా అందుబాటులోకి లేకపోవడం తో పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు 31,103 మంది కరోనా వైరస్ భారిన పడగా, అందులో 28,255 మంది ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన వారు. అయితే నేడు 1,030 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారిన పడి కోలుకున్న వారి సంఖ్య 16,464 కి చేరింది.తాజాగా నమోదు అయినా కరోనా వైరస్ మరణాల తో మొత్తం ఏపీ లో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 365 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రం లో 14,274 పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.