ఒక్క రోజులోనే నాలుగు లక్షలకు పైగా కరోనా కేసులు…భారత్ రికార్డు!

Thursday, May 6th, 2021, 10:59:50 AM IST

india_corona
భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే నిన్నా మొన్న మూడు లక్షల్లో నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నాలుగు లక్షలకు చేరుకున్నాయి. ప్రపంచంలో నే భారత్ పాజిటివ్ కేసుల్లో ఒక రికార్డు నెలకొల్పింది అని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో చేసిన కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలలో 4,12,262 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది.తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,10,77,410 కి చేరింది. అయితే ఈ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరింత అప్రమత్తం గా ఉండాలని నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 3,980 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 2,30,168 కి చేరింది. నిన్న ఒక్క రోజే 3,29,113 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 1,72,80,844 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 35,66,398 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.