బిగ్ న్యూస్: తెలంగాణలో ఆగని కరోనా కేసులు…ఆ ప్రాంతంలో ఎలాంటి మార్పు లేదు!

Sunday, May 24th, 2020, 09:55:00 PM IST


తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది.ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నమోదు అవుతున్న పాజిటివ్ కేసులు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిస్థితి మాత్రం ఎటువంటి మార్పు లేదు. అయితే తెలంగాణ లో తాజాగా 41 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా 23 గ్రేటర్ హైదరాబాద్ పరిధికి చెందినవే. అయితే రంగారెడ్డి లో ఒకటి, వలస కార్మికుల కు 11, ఫారిన్ నుండి వచ్చిన మరో 6 గురి కి పాజిటివ్ గా తేలింది.

అయితే కొత్తగా నమోదు అయిన ఈ పాజిటివ్ కేసులతో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,854 కి చేరింది. అయితే అందులో ఇప్పటివరకు 1,092 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఒక్కరోజే 24 మంది డిశ్చార్జ్ అవ్వడం గమనార్హం. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి యాక్టిివ్ ఉన్న కేసులు 709 కాగా, ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 53. అయితే కరోనా వైరస్ పరీక్షల విషయంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ తీరును మందలించగా, అవసరాల మేరకు పరీక్షలు నిర్వహి స్టున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.