తెలంగాణలో మరో 417 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Wednesday, January 6th, 2021, 10:08:54 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 43,318 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 417 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,88,410 కి చేరింది. అయితే ఈ మహమ్మారికి ఇంకా తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ వాక్సిన్ అందుబాటులోకి లేకపోవడం తో ఈ కరోనా ఉదృతి కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ఇద్దరు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,556 కి చేరింది.నిన్న ఒక్కరోజే ఈ మహమ్మారి భారీ నుండి 472 మంది కొలుకొగా, ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 2,81,872 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 4,982 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.