బిగ్ న్యూస్: భారత్ లో మరో 45,149 కేసులు…480 మరణాలు!

Monday, October 26th, 2020, 11:00:52 AM IST

భారత్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. కాకపోతే కాస్త తక్కువగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతూ ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 9,39,309 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 45,149 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 79,09,960 కి చేరింది. ఈ కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 480 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో ఇప్పటి వరకు భారత్ లో కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 1,19,014 కి చేరింది. అయితే కరోనా వైరస్ రికవరీ రేటు భారత్ లో మెరుగ్గా ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో మరో 59,105 మంది కరోనా వైరస్ నుండి కొలుకోగా, ఇప్పటి వరకూ 71,37,228 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 6,53,717 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.