బిగ్ న్యూస్: భారత్ లో మరో 41,810 కరోనా కేసులు…496 మరణాలు

Sunday, November 29th, 2020, 03:36:45 PM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఊహించని రీతిలో ఈ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 12,83,449 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 41,810 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 93,92,920 కి చేరింది. అయితే ఇంకా ఈ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావడం పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 496 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,36,696 కి చేరింది. నిన్న ఒక్కరోజే 42,298 మంది కరోనా వైరస్ భారీ నుండి కొలుకొగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 88,02,267 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 4,53,956 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.