బిగ్ న్యూస్: భారత్ లో తగ్గని కరోనా ఉధృతి…మరో 501 మంది మృతి

Sunday, November 22nd, 2020, 11:17:17 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గడిచిన 24 గంటల్లో 10,75,326 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 45,209 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 90,95,807 కి చేరింది. అయితే ఈ మహమ్మారికి ఇంకా వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 501 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,33,227 కి చేరింది. అయితే ఇప్పటి వరకు 85,21,617 మంది కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 4,40,962 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.