కరోనా అప్డేట్: భారత్ లో మరో 507 మరణాలు…18,653 కేసులు!

Wednesday, July 1st, 2020, 10:03:24 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే నమోదు అవుతున్న గణాంకాలు దేశ ప్రజలను ఆందోళన కి గురి చేస్తుంటే, గడిచిన 24 గంటల్లోనే 507 మంది మరణించడం తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. అయితే కొత్తగా నమోదు అయిన మరణలతో భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 17,400 కి చేరింది. అయితే గడిచిన 24 గంటల్లో 18,653 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

భారత దేశం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకీ పెరుగు తూనే ఉన్నాయి. తాజాగా నమోదు అయినా కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి, ఇప్పటి వరకు నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 5,85,493 కి చేరింది. భారత్ లో ఊహించని రీతిలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందుతుంది. అయితే రికవరీ కేసులు కూడా ఎక్కువగా ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పవచ్చు.

గడిచిన 24 గంటల్లో 13,157 మంది కరోనా వైరస్ మహమ్మారి భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 3,47,979 కి చేరింది. అయితే ప్రస్తుతం భారత్ లో 2,20,114 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.భారత్ లో ప్రస్తుతం అన్ లాక్ డౌన్ అమలు లో ఉండటం తో ఈ కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.