భారత్ లో మరో 35,551 కేసులు…526 మరణాలు

Thursday, December 3rd, 2020, 11:43:17 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. కేసుల తీవ్రత తక్కువగా ఉన్నా, మరణాలు మాత్రం ఐదు వందల వరకు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 11,11,698 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 35,551 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 95,34,964 కి చేరింది. అయితే ఈ మహమ్మారికి ఇంకా వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 526 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,38,648 కి చేరింది. ఇప్పటి వరకూ 89,73,373 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 4,22,943 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిి వ్ గా ఉన్నాయి.