తెలంగాణలో మరో 565 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Wednesday, December 2nd, 2020, 11:00:34 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 51,562 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 565 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,70,883 కి చేరింది. అయితే ఈ మహమ్మారి కి ఇంకా వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మృతుల సంఖ్య చాలా తక్కువగా ఉందని చెప్పాలి. నిన్ ఆ కరోనా తో ఒక్కరు మృతి చెందగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ తో ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య తెలంగాణ రాష్ట్రం లో 1,462 కి చేరింది. అయితే కరోనా వైరస్ రికవరీ రేటు తెలంగాణ లో మెరుగ్గా ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 925 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలు కొగా,. ఇప్పటి వరకు కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య 2,60,155 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 9,266 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.