బిగ్ న్యూస్: ఏపీ లో తాజాగా నమోదు అయిన కరోనా లెక్కలు ఇవే!

Saturday, September 19th, 2020, 06:18:03 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గడిచిన 24 గంటల్లో 74,595 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 8,218 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 6,17,776 కి చేరింది. అయితే ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అదే తరహాలో గడిచిన 24 గంటల్లో 58 మంది కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోగా, ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 5,302 కి చేరింది. అయితే కరోనా వైరస్ రికవరీ రేటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కాస్త మెరుగ్గా ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 10,820 మంది కరోనా వైరస్ భారీ నుండి కొలుకోగా, ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కోలుకున్న వారి సంఖ్య 5,30,711 కి చేరింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 81,763 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.