దేశవ్యాప్తంగా భారీగా తగ్గిన కరోనా కేసులు…మరో 587 మంది మృతి!

Tuesday, October 20th, 2020, 10:49:07 AM IST

భారత్ లో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతుంది. గడిచిన 3 నెలల్లో 50 వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి అని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో మరో 10,32,795 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 46,791 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే తాజా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 75,97,064 కి చేరింది. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది

అయితే అదే తరహాలో కరోనా వైరస్ మృతుల కొనసాగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 587 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే ఈ మరణాల తో కలిపి ఇప్పటి వరకు భారత్ లో కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 1,15,197 కి చేరింది. ఇంకా పూర్తి స్థాయిలో వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో ఈ మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

గడిచిన 24 గంటల్లో 69,270 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొగా, ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 67,33,329 కి చేరింది. అయితే భారత్ లో ప్రస్తుతం 7,48,538 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.