తెలంగాణలో మరో 593 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Monday, November 30th, 2020, 10:20:27 AM IST

తెలంగాణ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 33,040 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 593 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 119 కేసులు నమోదు కాగా, రంగారెడ్డి లో 61, మేడ్చల్ లో 54 కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,69,816 కి చేరింది. అయితే ఈ కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ముగ్గురు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తాజాగా కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి తో కలిలి మొత్తం ఇప్పటి వరకు కరోనా సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,458 కి చేరింది. కాగా, నిన్న ఒక్కరోజే 1,058 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకో గా, ఇప్పటి వరకు 2,58,336 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 10,022 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.