ఏపీ లో కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు…మరో 60 మంది మృతి!

Monday, September 14th, 2020, 06:20:21 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజుల నుండి పరిశీలిస్తే గడిచిన 24 గంటల్లో 7,956 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 61,529 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా ఈ మొత్తం లో పాజిటివ్ అని తేలింది. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 5,72,184 కి చేరింది. ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే గడిచిన 24 గంటల్లో ఏపీ లో మరో 60 మంది ఈ మహమ్మారి భారిన పడి ప్రాణాలను కోల్పోయారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 4,972 కి చేరింది. అయితే కరోనా వైరస్ నుండి కోలుకుంటున్న వారి సంఖ్య ఏపీ లో క్రమం గా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో 9,764 మంది కరోనా వైరస్ భారీ నుండి కొలుకొగా, ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి కోలుకున్న వారి సంఖ్య 4,74,008 కి చేరింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 93,204 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.