హైదరాబాద్ కి చేరుకున్న 60 వేల స్పుత్నిక్ – వి కరోనా టీకా డోసులు!

Sunday, May 16th, 2021, 01:18:00 PM IST


భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత పెరుగుతూ ఉండటం తో ఇతర దేశాలు తమకు తోచిన సహాయాన్ని చేస్తున్నాయి. అయితే రష్యా చెందిన స్పుత్నిక్ – వి కరోనా వైరస్ టీకా డోసులు నేడు భారత్ కి చేరుకున్నాయి. ఇప్పటికే మొదటి విడత కింద మే 1 వ తేదీన 1.50 లక్షల కరోనా వైరస్ టీకా డోసులు చేరిన విషయం అందరికి తెలిసిందే. తాజాగా రెండో విడత కింద 60 వేల టీకా డోసులు ప్రత్యేక విమానం లో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. అయితే ఈ నేపథ్యం లో భారత్ లోని రష్యా రాయబారి అయిన నికోలాయ్ కుడషేవ్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

కరోనా వైరస్ మహమ్మారి పై పోరు లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం పటిష్ఠంగా ముందుకు సాగుతోంది అని వ్యాఖ్యానించారు. అయితే రష్యాలో 2020 ద్వితీయార్థం నుండి ఈ వాక్సిన్ ప్రజలకి అందుబాటులోకి తీసుకు వచ్చాం అని వెల్లడించారు. అయితే కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడం లో ఈ టీకా మెరుగ్గా పని చేస్తోంది అని అన్నారు. అదే తరహాలో కొత్త వైరస్ రకాల పై న ఈ వైరస్ పని చేస్తోంది అని అన్నారు. అయితే భారత్ లో దీని తయారీ దశల వారీగా ఏడాది కి 850 మిలియన్ డోసులకు పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.