తెలంగాణలో మరో 609 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Thursday, December 3rd, 2020, 09:13:51 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 53,686 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 609 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,71,492 కి చేరింది. అయితే ఈ మహమ్మారి కి ఇంకా వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అయితే అదే తరహాలో కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ముగ్గురు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకు ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,465 కి చేరింది. అయితే కరోనా వైరస్ రికవరీ లో తెలంగాణ రాష్ట్రం మెరుగ్గా ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 873 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 2,61,028 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 8,999 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.