కరోనా అప్డేట్: భారత్ లో రికార్డ్ స్థాయిలో 24,850 కేసులు…613 మరణాలు!

Sunday, July 5th, 2020, 10:11:13 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఊహించని రీతిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. భారత్ లో రోజురోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే తాజాగా నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య తో ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 2,48,934 కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించగా, అందులో 24,850 మంది కి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. ఇప్పటి వరకు 9.78 మిలియన్ కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు జరపగా అందులో 6,73,165 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది.

అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రోజుకి వందల సంఖ్యలో మరణిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 613 మంది కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మృతి చెందారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారిన పడి భారత్ లో మరణించిన వారి సంఖ్య 19,268 కి చేరింది. కరోనా వైరస్ భారీ నుండి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది. ఈ అంశం కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పవచ్చు. గడిచిన 24 గంటల్లో 14,856 మంది కరోనా వైరస్ మహమ్మారి భారిన పడి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,09,083 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 2,44,814 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతున్నారు.

భారత్ లో రోజురోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న దేశం లో భారత్ 4 వ స్థానం లో కొనసాగుతుంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ వాక్సిన్ అందుబాటులోకి లేకపోవడం తో ఈ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.