బిగ్ అలెర్ట్ : తెలంగాణ లో మరొక 62 కేసులు నమోదు – 334 కి కరోనా బాధితులు…

Monday, April 6th, 2020, 07:29:25 AM IST

ప్రపంచ దేశాలని అన్నింటిని చిన్నాభిన్నం చేసిన బయంకరమైన మహమ్మారీ కరోనా వైరస్, భారత్ లో రోజురోజుకి చాలా బీభత్సంగా పెరుగుతుంది. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో భయంకరంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇకపోతే ఈ మహమ్మారిని అడ్డుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కఠినమైన చర్యలను అమలు చేశాయి. కానీ రాజధాని ఢిల్లీలో జరిగిన మార్కాజ్ ప్రార్థనలకి హాజరైన వారి కారణంగా ఈ కరోనా వైరస్ మరింతగా పెరిగిపోయింది. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఆదివారం ఒక్కరోజే 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు.

అయితే ఈ 62 కేసులతో ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 334 కు చేరుకుంది. అయితే ఈ వైరస్ కారణంగా ఇప్పటికీ 11 మంది మృతి చెందగా, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 33 మంది కోలుకున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 289 మంది చికిత్స పొందుతున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ వైరస్ భారిన పడి కోలుకున్న వారిని డిశ్చార్జ్ చేస్తున్నామని, అయినా కూడా వారిని మరొక 15 రోజులు అబ్సర్వేషన్ లో పెడుతున్నామని వైద్యాధికారులు వెల్లడించారు.