తెలంగాణలో మరో 7,646 కేసులు…53 మరణాలు

Friday, April 30th, 2021, 10:07:33 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 77,091 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 7,646 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 4,35,606 కి చేరింది. అయితే ఈ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత అప్రమత్తం గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రోజురోజుకీ మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉండటం పట్ల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో మరో 53 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 2,261 కి చేరింది. నిన్న ఒక్క రోజే 5,926 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య తెలంగాణ రాష్ట్రం లో 3,55,618 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 77,727 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.